గేమ్స్ ఇలా మొదలయ్యాయో లేదో.. అలా వేటను మొదలెట్టాయి దేశాలు. అమెరికా లాంటి అగ్రరాజ్యమూ.. ఫిజి లాంటి చిన్న దేశమూ ఉన్నాయందులో! ఒక్కో దేశం పతక వేటలో దూసుకుపోతుంటే భారతమంతా అటే చూసింది ఎన్నో ఆశలతో..
- 10మీ ఎయిర్ పిస్టల్‌లో కంచు మోగించిన బాకర్
- ఒలింపిక్ పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్‌గా రికార్డు
గేమ్స్ ఇలా మొదలయ్యాయో లేదో.. అలా వేటను మొదలెట్టాయి దేశాలు. అమెరికా లాంటి అగ్రరాజ్యమూ.. ఫిజి లాంటి చిన్న దేశమూ ఉన్నాయందులో! ఒక్కో దేశం పతక వేటలో దూసుకుపోతుంటే భారతమంతా అటే చూసింది ఎన్నో ఆశలతో.. ఎంతో ఉత్సుకతతో.. మరెంతో ఉద్విగ్నతతో.. మన బోణీ ఎప్పుడా అని, మనమెప్పుడు పతకాల పట్టికలో చేరతామా అని! కానీ అభిమానులకు మరీ ఎక్కువగా నిరీక్షించాల్సిన అవసరం లేకపోయింది. ఓ గొప్ప ఊరట. ఓ గొప్ప ఉపశమనం. ఎదురుచూపులకు తూటాతో టాటా.
మన మనూ మెరిసింది. పారిస్‌లో దేశానికి తొలి పతకాన్ని అందించింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో 10మీ ఎయిర్ పిస్టల్‌లో కాంస్యాన్ని గురి చూసి కొట్టిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళా షూటర్‌గా ఘనతను సొంతం చేసుకుంది. షూటింగ్‌లో 12 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. వెంట్రుక వాసిలో చేజారింది కానీ.. మను బాకర్‌కు రజతమే దక్కాల్సింది. కానీ కోట్ల హృదయాలను పులకించేలా చేసిన కంచూ వెలకట్టలేనిదే.
‘భగవద్గీత బలాన్నిచ్చింది!
ఇక నీ కలలను పక్కన పెట్టేయ్’ అని నా మనసు నాకెన్నిసార్లు చెప్పిందో! అపజయాలంతే.. మన నమ్మకాన్ని నిర్వీర్యం చేస్తాయి. కానీ, వాటిని అధిగమిస్తేనే, ఆ దశను దాటితేనే.. విజయతీరాలకు చేరగలుగుతాం’’ అంటోంది భారత స్టార్ షూటర్ మను బాకర్… తను అక్షరాలా అదే చేసింది. ప్రపంచ యవనికపై తిరుగలేని విజయాన్ని నమోదు చేసుకుంది.
‘‘ఇక నీ కలలను పక్కన పెట్టేయ్’ అని నా మనసు నాకెన్నిసార్లు చెప్పిందో! అపజయాలంతే.. మన నమ్మకాన్ని నిర్వీర్యం చేస్తాయి. కానీ, వాటిని అధిగమిస్తేనే, ఆ దశను దాటితేనే.. విజయతీరాలకు చేరగలుగుతాం’’ అంటోంది భారత స్టార్ షూటర్ మను బాకర్… తను అక్షరాలా అదే చేసింది. ప్రపంచ యవనికపై తిరుగలేని విజయాన్ని నమోదు చేసుకుంది. దానికి తన తల్లిదండ్రుల మద్దతుతో పాటు భగవద్గీత పారాయణమూ ఉపయోగపడిందంటోంది. అదెలాగో, ఆ కథ ఏంటో తెలుసుకుందామా!
పద్నాలుగేళ్ల టీనేజర్‌గా షూటింగ్ రేంజ్‌లోకి అడుగుపెట్టింది మను బాకర్. పారిస్ ఒలింపిక్స్ వేదికగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆమెది హరియాణాలోని ఝజ్జర్ దగ్గరున్న గోరియా గ్రామం. తండ్రి రామ్‌కిషన్ బాకర్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నారు. తల్లి సుమేధ గృహిణి. ఆ రాష్ట్రంలో బాలబాలికల నిష్పత్తిలో తీవ్రమైన వ్యత్యాసం, ఆడపిల్లలపై ఆంక్షలూ ఎక్కువే. అయితే, అవేవీ తమ బిడ్డపై ప్రభావం చూపించకూడదనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. కూతురి ఇష్టాలు, లక్ష్యాలకు చేయూతనివ్వాలనుకున్నారు. ఆడపిల్లలకు ఆటలెందుకన్న వారి మాటలు లెక్క చేయక, కష్టసుఖాల్లో కూతురికి అండగా నిలిచారు.
షూటింగ్ ప్రపంచకప్ సహా ఎన్నో టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసి భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగింది మను బాకర్. అయితే, ఆరంభంలో అదరగొట్టిన ఆమె పిస్టల్ తరవాత మొరాయించడంతో మధ్యలోనే ఆటను ముగించాల్సి వచ్చింది. ఆ విషయం తనని చాన్నాళ్లు ఒత్తిడికి గురి చేసింది. ఆపై మరెన్నో వివాదాలూ చుట్టుముట్టాయి. ఇవన్నీ ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టేశాయి అంటోంది మను. ‘టోక్యో ఒలింపిక్స్ తరవాత చాన్నాళ్లు మనస్ఫూర్తిగా కూడా నవ్వలేకపోయా. దాన్నుంచి బయట పడేందుకు చాలా సమయం పట్టింది. అయినా ఆట వదిలేయాలనుకోలేదు. ఎలాగైనా తిరిగి సాధించాలనుకున్నా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఫలితంపై కాకుండా కర్మపై దృష్టిపెట్టమని చెప్పాడు. నేనూ అదే చేశా. ముఖ్యంగా ఒత్తిడిని అదుపు చేసుకోవడానికి భగవద్గీతను చదివా. స్నేహితులతో కలిసి షాపింగ్ చేసేదాన్ని. వయొలిన్ వాయించేదాన్ని. యోగాపై ఇష్టం పెంచుకున్నా. ఇవన్నీ నా ఒత్తిడిని అదుపు చేసేవే. ఒకవేళ మనం దాన్ని నియంత్రించుకోలేకపోతే ముందుకు సాగలేం. ఈ క్రమంలో మనం కొంత ఓపికతో వేచి ఉంటే చాలు విజయం సాధించగలమని నమ్ముతా. ఆ నమ్మకమే ఈ రోజు నిజమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకోవడం కలలా అనిపిస్తోంది. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగానూ గుర్తింపు పొందడం గర్వంగానూ ఉంది. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవడానికి కృషి చేస్తా’నంటోంది మను బాకర్.
మీకు తెలుసా?
ఎక్కువ సేపు నిలబడితే సమస్యే…
ఈ రోజుల్లో మగవారితో పోటీపడి పనిచేస్తే అమ్మాయిల సంఖ్య ఎక్కువే. ఈ క్రమంలోనే వారి జీవనశైలీ మారిపోయింది. అయితే, ఎక్కువ సేపు కూర్చోవడమే కాదు… నిలబడి ఉన్నా కూడా అనారోగ్యాల ముప్పు ఎక్కువేనని చెబుతున్నాయి కానీ, ప్రపంచంలోని సగం మందికి పైగా తమ పనిదినాల్లో డెబ్భైఐదు శాతం నిలబడుతున్నారనేది ఓ అంచనా. వారిలో మహిళల సంఖ్యా ఎక్కువే. ముఖ్యంగా సేల్స్, ప్యాకేజింగ్ విభాగాల్లోనూ పరిశ్రమల్లోనూ పనిచేసేవారు ఇలా ఆరేడు గంటల పాటు నిరంతరాయంగా నిలబడాల్సి వస్తోంది. బదులుగా ప్రతి అరగంటకోసారి నడవడం, నిలుచున్న భంగిమ మార్చుకోవడం వంటివి చేయాలి. ఒత్తిడీ, శరీర బరువుని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, ఇతరత్రా వ్యాయామాలు చేయాలి. ఇవన్నీ సమస్యను కొంతవరకూ తగ్గిస్తాయి.
మను బకర్ గురించి
మను భాకర్ ఒక నిష్ణాతురాలైన భారతీయ స్పోర్ట్ షూటర్, మను భాకర్ ఫిబ్రవరి 18, 2002న హర్యానాలోని ఝజ్జర్ జిల్లా గోరియా గ్రామంలో జన్మించిన ఆమె షూటింగ్ రంగానికి గణనీయమైన కృషి చేస్తున్నారు.
ప్రధాన విజయాలు:
- ఒలింపిక్ కాంస్య పతక విజేత: పారిస్‌లో జరిగిన 2024 సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుచుకుంది, ఒలింపిక్ షూటింగ్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ.
- కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్: కేవలం 16 సంవత్సరాల వయస్సులో, ఆమె 2018 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
- ప్రపంచ కప్ విజయం: ఆమె ISSF ప్రపంచ కప్ ఈవెంట్‌ల నుండి అనేక బంగారు పతకాలను సాధించింది.
- యూత్ ఒలింపిక్ గేమ్స్: బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను బంగారు పతకాన్ని గెలుచుకుంది, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ షూటర్‌గా నిలిచింది.
- ISSF ప్రపంచ కప్: ఆమె వివిధ ISSF ప్రపంచ కప్ ఈవెంట్లలో బహుళ బంగారు పతకాలను గెలుచుకుంది, అంతర్జాతీయ వేదికపై తన నిలకడ మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.
- ఆసియా గేమ్స్: మను 2018 ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తన తోటి షూటర్ సౌరభ్ చౌదరితో కలిసి బంగారు పతకాన్ని సాధించాడు.
కెరీర్ హైలైట్స్:
- ప్రారంభం: మను 14 సంవత్సరాల వయస్సులో తన షూటింగ్ వృత్తిని ప్రారంభించింది మరియు ఆమె అసాధారణమైన ప్రతిభ మరియు అంకితభావంతో త్వరగా ప్రముఖంగా ఎదిగింది.
- జాతీయ రికార్డులు: ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అనేక జాతీయ రికార్డులను నెలకొల్పింది, క్రీడలో తన ఆధిపత్యాన్ని మరింతగా నిలబెట్టుకుంది.
- అవార్డులు మరియు గుర్తింపు: మను జాతీయ క్రీడలలో అత్యుత్తమ విజయాలను గుర్తించే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సహా వివిధ అవార్డులతో సత్కరించబడ్డారు.
వ్యక్తిగత లక్షణాలు:
బహుముఖ ప్రజ్ఞ: షూటింగ్‌పై దృష్టి పెట్టడానికి ముందు, మను బాక్సింగ్, టెన్నిస్ మరియు స్కేటింగ్ వంటి ఇతర క్రీడలలో తన బహుముఖ అథ్లెటిక్ సామర్థ్యాలను ప్రదర్శించింది.
ఆమె ప్రయాణంలో కృషి మరియు పట్టుదల వల్ల, యావత్ భారతదేశం అంతటా యువ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా నిలిచారు
మను భాకర్ కథ నిజంగా స్ఫూర్తిదాయకం, షూటింగ్ పట్ల ఆమె అంకితభావం మరియు అభిరుచిని ప్రతిబింబిస్తుంది, వారు భవిష్యత్ మరిన్ని విజయాలను అందుకోవాలని మంచుకొండ ఫౌండేషన్ మనసారా ఆకాంక్షిస్తుంది
🖊️బ్యూరో చీఫ్: కె కళ్యాణి, బోధ మరియు మంచుకొండ ఇన్సైట్స్ | ఈనాడు వారి సౌజన్యంతో